Jesus Quotes in Telugu

Share This Quote:

Jesus Quotes in Telugu, Jesus powerful words in telugu, Best 53 Jesus Christ Quotes in Telugu, Jesus Christ Quotes in Telugu, Jesus powerful Words in Telugu, Jesus quotations In Telugu download, Telugu Bible Quotes For Whatsapp, Bible Quotes In Telugu, Jesus Daily quotes in Telugu, Jesus vakyalu In Telugu Images, Jesus vakyalu Telugu lo

List of Best 53 Jesus Christ Quotes in Telugu

Quote: 1

మీ హృదయాలు కలవరపడనివ్వవద్దు. దేవుడిని నమ్మండి; నన్ను కూడా నమ్మండి.

Jesus Christ

Quote: 2

నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు.

Jesus Christ

Quote: 3

తనను తాను గొప్పగా హెచ్చించుకొనే ప్రతి ఒక్కరూ తగ్గించబడతారు. తనను తాను తగ్గించుకునే ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఉంటారు.

Jesus Christ

Quote: 4

మీలో పాపం లేనివాడు మొదటగా రాయి వేయాలి.

Jesus Christ

Quote: 5

మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా?

Jesus Christ

Quote: 6

దయగలవారు ధన్యులు, ఎందుకంటే వారికి దయ చూపబడుతుంది.

Jesus Christ

Quote: 7

ఆరోగ్యవంతుడికి కాదు, అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యుడు అవసరం. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పశ్చాత్తాపానికి పిలిచాను.

Jesus Christ

Quote: 8

నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు.

Jesus Christ

Quote: 9

అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

Jesus Christ

Quote: 10

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.

Jesus Christ

Quote: 11

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె, సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను.

Jesus Christ

Quote: 12

ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?

Jesus Christ

Quote: 13

రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును.

Jesus Christ

Quote: 14

నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింప వలెను.

Jesus Christ

Quote: 15

వ్యభిచారం చేయకూడదు, చంపకూడదు, దొంగిలించకూడదు, ఆశించకూడదు అనే ఆజ్ఞలన్నీ, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

Jesus Christ

Quote: 16

మనిషి రొట్టె ద్వారా మాత్రమే జీవించడు కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు.

Jesus Christ

Quote: 17

పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

Jesus Christ

Quote: 18

మీరు పరిపూర్ణంగా ఉండాలనుకుంటే, వెళ్లి, మీ ఆస్తులను అమ్మి పేదలకు ఇవ్వండి, మీకు స్వర్గంలో సంపద ఉంటుంది.

Jesus Christ

Quote: 19

ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

Jesus Christ

Quote: 20

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

Jesus Christ

Quote: 21

సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

Jesus Christ

Quote: 22

నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.

Jesus Christ

Quote: 23

 కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

Jesus Christ

Quote: 24

హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

Jesus Christ

Quote: 25

సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.

Jesus Christ

Quote: 26

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

Jesus Christ

Quote: 27

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

Jesus Christ

Quote: 28

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

Jesus Christ

Quote: 29

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

Jesus Christ

Quote: 30

 నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

Jesus Christ

Quote: 31

తన సహో దరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

Jesus Christ

Quote: 32

స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

Jesus Christ

Quote: 33

ఎంత మాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము.

Jesus Christ

Quote: 34

ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

Jesus Christ

Quote: 35

మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి;

Jesus Christ

Quote: 36

ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.

Jesus Christ

Quote: 37

నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

Jesus Christ

Quote: 38

భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలించెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలించలేరు.

Jesus Christ

Quote: 39

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

Jesus Christ

Quote: 40

మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

Jesus Christ

Quote: 41

 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

Jesus Christ

Quote: 42

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

Jesus Christ

Quote: 43

నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

Jesus Christ

Quote: 44

చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

Jesus Christ

Quote: 45

సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

Jesus Christ

Quote: 46

మనిషికి ఇది అసాధ్యం, కానీ దేవుడికి అన్నీ సాధ్యమే.

Jesus Christ

Quote: 47

మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండ వలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.

Jesus Christ

Quote: 48

ఒకడు క్రొత్తగా జన్మించితే గానీ, అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు.

Jesus Christ

Quote: 49

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

Jesus Christ

Quote: 50

పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు.

Jesus Christ

Quote: 51

ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

Jesus Christ

Quote: 52

మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.

Jesus Christ

Quote: 53

చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఇలాంటి వారిదే.

Jesus Christ

Here is the end of List of Best 53 Jesus Christ Quotes in Telugu . All Jesus Christ Quotes in Telugu are in Telugu Text.

Stay Motivated. Visit this Website for best Quotes in Telugu Text.

Read Other Quotes
Share This Quote:

Leave a Comment