Top 101 Mahatma Gandhi Quotes in Telugu

Share This Quote:

Top 101 Mahatma Gandhi Quotes in Telugu, Mahatma Gandhi Quotes in Telugu, Mahatma Gandhi Best Quotes in Telugu, Best Quotes of Mahatma Gandhi Quotes in Telugu, Top Quotes of Mahatma Gandhi Quotes in Telugu, Gandhi Quotes in Telugu

Here, We have Listed out Top 101 Mahatma Gandhi Quotes in Telugu. All Top 101 Mahatma Gandhi Quotes in Telugu are in Telugu Text.

Quote: 1

మొదట ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు , తర్వాత వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు, తర్వాత వారు మీతో పోరాడతారు, చివరికి  మీరు గెలుస్తారు.

Mahatma Gandhi
Quote: 2

మీరు రేపే చనిపోతామనే భావనతో  జీవించండి, ఎప్పటికీ జీవించి ఉంటామనే భావనతో   నేర్చుకోండి.

Mahatma Gandhi
Quote: 3

మీరు ఆలోచించేది, మీరు చెప్పేది మరియు మీరు చేసేది ఒకేలా  ఉన్నప్పుడే మీరు సంతోషంతో ఉంటారు.

Mahatma Gandhi
Quote: 4

ప్రపంచంలో ఏ మార్పునైతే మీరు చూడాలనుకుంటునారో, ఆ మార్పుని మొదట మీలో కలగనీయండి.

Mahatma Gandhi
Quote: 5

ఎక్కడ ప్రేమ ఉంటుందో,  అక్కడ నిజమైన జీవితం ఉంటుంది. .

Mahatma Gandhi
Quote: 6

ప్రార్థనలో హృదయం లేని మాటల కంటే పదాలు లేని హృదయం ఉండటం మంచిది.

Mahatma Gandhi
Quote: 7

బలహీనులు ఎన్నటికీ క్షమించలేరు. క్షమించడం బలవంతుడి లక్షణం.

Mahatma Gandhi
Quote: 8

ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే  మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఉత్తమ మార్గం.

Mahatma Gandhi
Quote: 9

ఒక వ్యక్తి తన ఆలోచనల యొక్క ఉత్పత్తి, అతను ఏమి ఆలోచిస్తాడో అదే అవుతాడు.

Mahatma Gandhi
Quote: 10

బలం, భౌతిక సామర్థ్యం నుంచి రాదు. లొంగని బలమైన సంకల్పం నుండి వస్తుంది.

Mahatma Gandhi
Quote: 11

సున్నితమైన మార్గంలో, మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు.

Mahatma Gandhi
Quote: 12

మీరు నన్ను బంధించవచ్చు, మీరు నన్ను హింసించవచ్చు, మీరు ఈ శరీరాన్ని కూడా నాశనం చేయవచ్చు, కానీ మీరు నా మనసును ఎన్నడూ బంధించలేరు.

Mahatma Gandhi
Quote: 13

న్యాయస్థానాల కంటే ఉన్నత న్యాయస్థానం ఉంది. అది మనస్సాక్షి అనే న్యాయస్థానం. ఇది అన్ని ఇతర కోర్టులను అధిగమిస్తుంది.

Mahatma Gandhi
Quote: 14

మీరు మానవత్వంపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. మానవత్వం ఒక సముద్రం; సముద్రం యొక్క కొన్ని చుక్కలు మురికిగా ఉంటే, సముద్రం మురికిగా మారదు.

Mahatma Gandhi
Quote: 15

నేను హింసను వ్యతిరేకిస్తున్నాను.  ఎందుకంటే అది మంచిగా కనిపించినప్పటికీ, ఆ మంచి అనేది తాత్కాలికం మాత్రమే; అది చేసే చెడు మాత్రం శాశ్వతం.

Mahatma Gandhi
Quote: 16

టన్నుల కొద్దీ మాటలకంటే, ఒక చిన్న ఆచరణ ఎంతో ఉత్తమం.

Mahatma Gandhi
Quote: 17

కంటికి, కన్నును తీస్తే,  ప్రపంచం మొత్తం అంధకారంగా మారుతుంది.

Mahatma Gandhi
Quote: 18

ఈ భూమిపై మనిషి అవసరానికి తగినంత ఉంది.  కానీ మనిషి అత్యాశకు సరిపడేంత లేదు.

Mahatma Gandhi
Quote: 19

ఆరోగ్యమే నిజమైన సంపద. బంగారం, వెండి కాదు.

Mahatma Gandhi
Quote: 20

నాకు నవ్వే మనసు  లేకపోతే, నేను చాలా కాలం క్రితం ఆత్మహత్య చేసుకునేవాడిని.

Mahatma Gandhi
Quote: 21

నా అనుమతి లేకుండా ఎవరూ నన్ను బాధపెట్టలేరు.

Mahatma Gandhi
Quote: 22

సంతృప్తి అనేది ప్రయత్నంలో ఉంది, సాధించడంలో కాదు, పూర్తి ప్రయత్నమే  పూర్తి విజయం.

Mahatma Gandhi
Quote: 23

స్వేచ్ఛ అనేది తప్పు చేయడానికి స్వేచ్ఛను కలిపించకపోతే, అది విలువైన స్వేచ్ఛ కాదు.

Mahatma Gandhi
Quote: 24

మంచికి సహకరించడం, చెడుకి సహకరించకపోవడం మన విధి.

Mahatma Gandhi
Quote: 25

అన్ని మతాల సారాంశం ఒక్కటే. వాటి  విధానాలు మాత్రమే భిన్నంగా ఉంటాయి.

Mahatma Gandhi
Quote: 26

పిరికివాడు ప్రేమను ప్రదర్శించలేడు; అది ధైర్యవంతుల హక్కు.

Mahatma Gandhi
Quote: 27

నిజాయితీ గల అసమ్మతి, పురోగతికి మంచి సంకేతం.

Mahatma Gandhi
Quote: 28

మనం ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని బోధించాలంటే, యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధాన్ని కొనసాగించాలంటే, మన పిల్లలతోనే ప్రారంభించాలి.

Mahatma Gandhi
Quote: 29

ఎక్కువమంది  ప్రచారం చేసినంత మాత్రాన ఒక లోపం ఎప్పుడూ నిజం కాదు, ఎవరూ చూడనందున నిజం ఎప్పుడూ తప్పుగా మారదు.

Mahatma Gandhi
Quote: 30

స్త్రీ యొక్క నిజమైన ఆభరణం; ఆమె స్వభావం, ఆమె స్వచ్ఛత.

Mahatma Gandhi
Quote: 31

జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సరిగ్గా జీవించడం, సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా వ్యవహరించడం.

సత్యం న్యాయాన్ని ఎన్నటికీ పాడు చేయదు.

Mahatma Gandhi
Quote: 32

నేను ఒక సమయంలో నాయకత్వం అంటే కండబలం అని అనుకున్నాను; కానీ నాయకత్వం అంటే ప్రజలతో మమేకం కావడం అని తెలుసుకున్నాను.

Mahatma Gandhi
Quote: 33

నేను మనుష్యులలో మంచి లక్షణాలను మాత్రమే చూస్తాను.ఇతరుల తప్పిదాలను నేను వెదకను. ఎందుకంటే నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.

Mahatma Gandhi
Quote: 34

మానవజాతికి అహింస గొప్ప శక్తి. ఇది మనిషి తెలివితేటలతో రూపొందించబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం కంటే శక్తివంతమైనది.

Mahatma Gandhi
Quote: 35

ఎలా ఆలోచించాలో తెలిసిన వారికి గురువులు అవసరం లేదు.

Mahatma Gandhi
Quote: 36

ప్రజల మద్దతు లేకపోయినా సత్యం నిలుస్తుంది.

Mahatma Gandhi
Quote: 37

నా మతం నిజం మరియు అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు. అహింస అతన్ని సాక్షాత్కరించే సాధనం.

Mahatma Gandhi
Quote: 38

కోపం మరియు అసహనం సరిగ్గా అర్ధంచేసుకోవటానికి శత్రువులు.

Mahatma Gandhi
Quote: 39

మనిషి తన సహచరుల సంక్షేమం కోసం పనిచేస్తే గొప్పవాడు అవుతాడు.

Mahatma Gandhi
Quote: 40

ఆందోళన కన్నా దేహాన్ని పాడు  చేసేది ఏదీ లేదు. దేవునిపై విశ్వాసం ఉన్న వ్యక్తి , దేని గురించైనా ఆందోళన చెందడానికి సిగ్గుపడాలి.

Mahatma Gandhi
Quote: 41

అహింసకు రెండు విశ్వాసాలు కావాలి. దేవునిపై విశ్వాసం మరియు మనిషిపై విశ్వాసం.

Mahatma Gandhi
Quote: 42

మనము పొరపాట్లు చేసి పడిపోవచ్చు కానీ మళ్లీ లేస్తాము; అంతేగాని మనము యుద్ధం నుండి పారిపోకూడదు.

Mahatma Gandhi
Quote: 43

దేనినైనా నమ్మడం, కానీ ఆ నమ్మకం ప్రకారం జీవించకపోవడం నిజాయితీ లేని పని.

Mahatma Gandhi
Quote: 44

సత్యం స్వతహాగా స్వయం-స్పష్టమైనది. మీరు దానిని చుట్టుముట్టిన అజ్ఞానపు వలలను తీసివేసిన వెంటనే, అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

Mahatma Gandhi
Quote: 45

పూర్తిగా నిర్దోషిగా ఉన్న వ్యక్తి, తన శత్రువులతో సహా ఇతరుల మంచి కోసం తనను తాను అర్పించుకున్నాడు మరియు ప్రపంచానికి విమోచన క్రయధనంగా మారారు. ఇది ఒక ఖచ్చితమైన చర్య.

Mahatma Gandhi
Quote: 46

ప్రకృతి ఆమెకు అందించిన నిస్వార్థ సేవా స్ఫూర్తితో పురుషుడు ఎన్నటికీ స్త్రీతో సమానంగా ఉండలేడు.

Mahatma Gandhi
Quote: 47

మన దోషాలను ఒప్పుకోవడం అనేది చీపురుతో మురికిని తుడిచి, ఉపరితలాన్ని ప్రకాశవంతంగా, స్పష్టంగా చేయడం లాంటిది.

Mahatma Gandhi
Quote: 48

మంచి మనిషి అన్ని జీవులకు స్నేహితుడు.

Mahatma Gandhi
Quote: 49

సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనం ముందు, మనిషి తన చర్యల ద్వారా కాకుండా , ఉద్దేశాల ద్వారా తీర్పు తీర్చబడతాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే మన హృదయాలను చదువగలడు.

Mahatma Gandhi
Quote: 50

ఒక వ్యక్తి తన సొంత మతం యొక్క హృదయాన్ని చేరుకున్నట్లయితే, అతను ఇతరుల హృదయాన్ని కూడా చేరుకోగలడు.

Mahatma Gandhi
Quote: 51

వేలాది ప్రార్ధనలు చేయడం కంటే, చిన్న చర్య ద్వారా ఒక హృదయాన్ని సంతోషపెట్టడం ఉత్తమం.

Mahatma Gandhi
Quote: 52

మీరు మీ స్నేహితులతో స్నేహంగా ఉండటం చాలా సులభం. కానీ మిమ్మల్ని మీ శత్రువుగా భావించే వ్యక్తితో స్నేహం చేయడం నిజమైన మతం. మరొకటి కేవలం వ్యాపారం.

Mahatma Gandhi
Quote: 53

అసహనం అనేది ఒక రకమైన హింస. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి పెరుగుదలకు అది అడ్డంకి.

Mahatma Gandhi
Quote: 54

ప్రార్థన అంటే ఒకరి స్వంత అనర్హతల్ని మరియు బలహీనతల్నిఒప్పుకోవడం.

Mahatma Gandhi
Quote: 55

కోపం అహింసకు శత్రువు మరియు అహంకారం దానిని మింగేసిన రాక్షసుడు.

Mahatma Gandhi
Quote: 56

ప్రతి ఒక్కరూ  శాంతిని తమ లోపల నుండి వెతకాలి. నిజమైన శాంతి బయటి పరిస్థితుల ప్రభావంకి లొంగదు.

Mahatma Gandhi
Quote: 57

అన్యాయమైన చట్టం కూడా ఒక రకమైన హింస.

Mahatma Gandhi
Quote: 58

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు కూడా ఉంటాడు.

Mahatma Gandhi
Quote: 59

ప్రేమ ఇచ్చే న్యాయం లొంగిపోవడం, చట్టం ఇచ్చే న్యాయం శిక్ష.

Mahatma Gandhi
Quote: 60

పాపమును ద్వేషించు, కానీ పాపిని ప్రేమించు.

Mahatma Gandhi
Quote: 61

ఈ రోజు మీరు చేసే పనులపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Mahatma Gandhi
Quote: 62

దేవుడికి మతం లేదు.

Mahatma Gandhi
Quote: 63

నేను ఎవరినీ వారి మురికి పాదాలతో నా మనసులో నడవనివ్వను.

Mahatma Gandhi
Quote: 64

మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి, మీ ఆలోచనలు మీ మాటలు అవుతాయి, మీ మాటలు మీ చర్యలుగా మారతాయి, మీ చర్యలు మీ అలవాట్లు అవుతాయి, మీ అలవాట్లు మీ విలువలుగా మారతాయి, మీ విలువలు మీ విధిగా మారతాయి.

Mahatma Gandhi
Quote: 65

ప్రతిరోజూ ఉదయం మొదటి చర్య రోజు కోసం ఈ క్రింది నిర్ణయం తీసుకుందాం:

– భూమిపై నేను ఎవరికీ భయపడను.

– నేను దేవునికి మాత్రమే భయపడతాను.

– నేను ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించను.

– ఎవరి అన్యాయానికి నేను లొంగను.

– సత్యం ద్వారా నేను అసత్యాన్ని జయించగలను.

– అవాస్తవాలను ఎదిరించడంలో, నేను అన్ని బాధలను భరిస్తాను

Mahatma Gandhi
Quote: 66

మీరు ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పుడల్లా. ప్రేమతో అతన్ని జయించండి.

Mahatma Gandhi
Quote: 67

మీరు నిజంగా ఒకరిని కోల్పోయే వరకు ఎవరు ముఖ్యమో మీకు తెలియదు.

Mahatma Gandhi
Quote: 68

మిమ్మల్ని మీరు మార్చుకోండి – మీరు నియంత్రణలో ఉంటారు

Mahatma Gandhi
Quote: 69

మనం ఇవ్వకపోతే ఎవరూ మన ఆత్మగౌరవాన్ని తీసివేయలేరు.

Mahatma Gandhi
Quote: 70

మంచి ఇంటికి సమానమైన పాఠశాల లేదు. సద్గుణవంతులైన తల్లిదండ్రులకు సమానమైన ఉపాధ్యాయుడు లేరు.

Mahatma Gandhi
Quote: 71

ఏదైనా చేయడంలో, ప్రేమతో చేయండి లేదా అస్సలు చేయవద్దు.

Mahatma Gandhi
Quote: 72

ఇతరుల బాధలను అర్థం చేసుకున్న వారిని  నేను మతవాది అని పిలుస్తాను.

Mahatma Gandhi
Quote: 73

ఎక్కువ సంపదను కాదు, సరళమైన ఆనందాన్ని కోరుకోండి. అధిక సంపద కాదు, లోతైన సంతోషాన్ని కోరుకోండి.

Mahatma Gandhi
Quote: 74

ఎల్లప్పుడూ మీ ఆలోచనలను శుద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి, అంతా బాగానే ఉంటుంది.

Mahatma Gandhi
Quote: 75

నిర్భయత ఆధ్యాత్మికతకు మొదటి అవసరం. పిరికివారు ఎప్పుడూ నైతికంగా ఉండలేరు.

Mahatma Gandhi
Quote: 76

ఒక కొవ్వొత్తి యొక్క మంట నుండి వెయ్యి కొవ్వొత్తులను వెలిగించవచ్చు, దాని వల్ల  కొవ్వొత్తి యొక్క జీవితం తగ్గించబడదు.

Mahatma Gandhi
Quote: 77

విశ్వంలో శక్తి ఉంది, మనం అనుమతిస్తే, అది మనలో ప్రవహిస్తుంది మరియు అద్భుత ఫలితాలను ఇస్తుంది.

Mahatma Gandhi
Quote: 78

వారు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలను విచ్ఛిన్నం చేయవచ్చు, నన్ను చంపవచ్చు. అప్పుడు వారు నా మృతదేహాన్ని కలిగి ఉంటారు, కానీ నా విధేయత కాదు.

Mahatma Gandhi
Quote: 79

చదువుకున్న వ్యక్తుల గుండె కాఠిన్యం కన్నా జీవితంలో ఏదీ నన్ను ఎక్కువగా బాధించలేదు.

Mahatma Gandhi

Quote: 80

గుంపులో నిలబడటం సులభం కానీ ఒంటరిగా నిలబడటానికి ధైర్యం కావాలి.

Mahatma Gandhi
Quote: 81

నిజమైన అందం మనసు యొక్క స్వచ్ఛతలో ఉంటుంది.

Mahatma Gandhi
Quote: 82

మీరు పిడికిలి బిగించి చేతులు కలపలేరు.

Mahatma Gandhi
Quote: 83

మీరు భయపడటానికి నిరాకరిస్తే మిమ్మల్ని భయపెట్టడానికి ఏమీ ఉండదు.

Mahatma Gandhi
Quote: 84

చాలా మంది, ముఖ్యంగా అజ్ఞానులు, నిజం మాట్లాడినందుకు, సరిగ్గా ఉన్నందుకు మిమ్మల్ని శిక్షించాలనుకుంటారు. అలంటి వారికి ఎప్పుడూ క్షమాపణ చెప్పవద్దు. మీరు చేస్తుంది సరైనది అని మీకు తెలిస్తే, మీ మనస్సులో ఉన్నది మాట్లాడండి. మీరు ఒక మైనారిటీ అయినా, నిజం ఎప్పటికీ  నిజం.

Mahatma Gandhi
Quote: 85

మీ గురించి కనీసం చింతించకండి, అన్ని ఆందోళనలను దేవునికి వదిలేయండి, ‘ – ఇది అన్ని మతాలలో ఆజ్ఞగా కనిపిస్తుంది.

Mahatma Gandhi
Quote: 86

నిజమైన ప్రేమ సముద్రం వలె అపరిమితంగా ఉంటుంది.  అన్ని సరిహద్దులను దాటి, మొత్తం ప్రపంచాన్ని ఆవరించింది.

Mahatma Gandhi
Quote: 87

టెర్రరిజం మరియు వంచన అనేవి బలహీనులకి  ఆయుధాలు, బలవంతులకి కాదు.

Mahatma Gandhi
Quote: 88

నిజమైన అవసరాలు మరియు కృత్రిమ కోరికల మధ్య తేడాను గుర్తించండి.

Mahatma Gandhi
Quote: 89

ప్రవర్తన అనేది మన ఇమేజ్‌ని ప్రదర్శించే అద్దం.

Mahatma Gandhi
Quote: 90

ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉండకండి. మీ కోసం స్వతంత్రంగా ఆలోచించడం నిర్భయతకు సంకేతం.

Mahatma Gandhi
Quote: 91

మీరు వ్యక్తిత్వాన్నినిర్మించుకోకపోతే, మీ ఆలోచనలు మరియు మీ చర్యలపై నియంత్రణ సాధించలేకపోతే మీరు అభ్యసించిన ఎంత గొప్ప విద్య అయినా వృధా.

Mahatma Gandhi
Quote: 92

వినయం లేని సేవ అనేది స్వార్థం మరియు అహంభావంతో కూడుకున్నది.

Mahatma Gandhi
Quote: 93

మీ జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి: ఏదీ అద్భుతం కాదన్నట్టుగా జీవించడం, ప్రతీది అద్భుతమే అన్నట్టుగా జీవించడం.

Mahatma Gandhi
Quote: 94

మీరు బాధ లేకుండా నిజమైన జీవితాన్ని గడపలేరు.

Mahatma Gandhi
Quote: 95

స్వార్థం గుడ్డిది.

Mahatma Gandhi
Quote: 96

సాధారణ మనిషి మిలియన్ సార్లు ప్రయత్నించవచ్చు..కానీ ఒక ఆశయం ఉన్న మనిషి మాత్రమే మిలియన్ మార్గాల్లో విభిన్నంగా ప్రయత్నిస్తాడు. సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలను సృష్టించండి.

Mahatma Gandhi
Quote: 97

చక్కగా, శుభ్రంగా మరియు గౌరవంగా జీవించడానికి డబ్బు అవసరం లేదు.

Mahatma Gandhi
Quote: 98

దేవుడు ప్రతిరోజూ మనతో మాట్లాడుతాడు, మనకు ఎలా వినాలో తెలియదు.

Mahatma Gandhi
Quote: 99

పరిపక్వ ఆలోచనలు ఉన్న పురుషులు మాత్రమే తమను తాము పరిపాలించుకోగలరు. తొందరపాటు స్వభావం గలవారు కాదు.

Mahatma Gandhi
Quote: 100

న్యాయం కోరుకునే మనం ఇతరులకు న్యాయం చేయాలి.

Mahatma Gandhi
Quote: 101

పరిపక్వ ఆలోచనలు ఉన్న పురుషులు మాత్రమే తమను తాము పరిపాలించుకోగలరు. తొందరపాటు స్వభావం గలవారు కాదు.

Mahatma Gandhi

Here is the end of list of Top 101 Mahatma Gandhi Quotes.

Read Other Quotes
Share This Quote:

Leave a Comment