Albert Einstein Quotes in Telugu,Top 30 Albert Einstein Quotes in Telugu text, Albert Einstein BIOGRAPHY in Telugu
ఆల్బర్ట్ ఐన్స్టీన్ – జీవిత చరిత్ర క్లుప్తంగా
ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మనీ దేశానికి చెందిన ఫిజిక్స్ శాస్త్రవేత్త. ఐన్స్టీన్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది E = mc2 అనే ఫార్ములా.
Genera theory of relativity, special theory of relativity అనే సిద్ధాంతాలు ఒక కొత్త కోణంలో విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి తలుపులు తెరిచాయి.
20వ శతాబ్దంలో జన్మించిన గొప్ప శాస్త్రవేత్తల్లో ఐన్స్టీన్ కూడా ఒకరు.
ఈయన కనిపెట్టిన E = mc2 అనే ఫార్ములా ఉపయోగించి అణు బాంబుని డెవలప్ చేసారు.
1921 లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ కి నోబుల్ ప్రైజ్ వచ్చింది.
Albert Einstein Death
గుండెకి సంబంధించిన వ్యాధితో హాస్పిటల్ జాయిన్ అయ్యారు.
ఆ వ్యాధికి సర్జరీ చేస్తే బ్రతికే అవకాశం ఉండేది కానీ EINSTEIN సర్జరీకి అంగీకరించలేదు.
హాస్పిటల్ బెడ్ పై ఆయన చివరిగా పలికిన మాటలు :
- నేను కోరుకున్నప్పుడే నేను చనిపోవాలని అనుకుంటున్నాను.
- ఆ ఆపరేషన్ చేయించుకుని కృత్రిమంగా నా జీవితాన్ని గడపాలి అనుకోవట్లేదు.
- నేను చేయాల్సిందంతా చేసేసాను, ఇప్పుడు నేను వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.
ఏప్రిల్ 18, 1955 – 76 సంవత్సరాల వయసులో EINSTEIN చనిపోయారు.
చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేసిన డాక్టర్ ఎవరికి తెలియకుండా ఐన్ స్టీన్ బ్రెయిన్ ని దొంగతనంగా దాచేసారు.
EINSTEIN ఎందుకు ఇంత ఇంటెలిజెన్స్ ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి, ఆయన బ్రెయిన్ స్టడీ చేయడానికి ఆ డాక్టర్ ఐన్స్టీన్ బ్రెయిన్ ని దొంగలించారు.
ఒక జీనియస్ ఫిజిక్స్ సైంటిస్ట్ చెప్పిన కొన్ని మాటల్ని కోట్స్ రూపంలో తెలుసుకుందాం.
List of Top 30 Albert Einstein Quotes in Telugu
Quote: 1
రెండు విషయాలు అనంతం: విశ్వం మరియు మనిషి యొక్క మూర్ఖత్వం
Albert Einstein
Quote: 2
మీ జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఏమీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి అంతా ఒక అద్భుతంలా భావించి గడపడం.
Albert Einstein
Quote: 3
జ్ఞానం కంటే ఊహాశక్తి ముఖ్యం. జ్ఞానం పరిమితం. ఊహాశక్తికి హద్దులు లేవు.
Albert Einstein
Quote: 4
మీరు ఒక విషయాన్ని ఆరేళ్ల పిల్లలకు వివరించలేకపోతే, అది మీకు పూర్తిగా అర్ధం కాలేదని అర్ధం.
Albert Einstein
Quote: 5
లాజిక్ మిమ్మల్ని A నుండి Z వరకు తీసుకెళ్లగలదు; ఊహాశక్తి మిమ్మల్నిఎక్కడికైనా తీసుకెళ్లగలదు.
Albert Einstein
Quote: 6
జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. మీ సమతుల్యతను కొనసాగించడానికి మీరు తొక్కుతూనే ఉండాలి.
Albert Einstein
Quote: 7
మీరు ఏ తప్పు చేయకపోతే, కొత్తగా దేనిని ప్రయత్నించలేదని అర్ధం.
Albert Einstein
Quote: 8
చెత్తను శుభ్రపరిచే వ్యక్తితోనైనా, విశ్వవిద్యాలయ అధ్యక్షుడితోనైనా, నేను అందరితో ఒకే విధంగా మాట్లాడతాను.
Albert Einstein
Quote: 9
తెలివైన వాడు సమస్యను పరిష్కరిస్తాడు. జ్ఞానం గల వాడు సమస్యను నివారిస్తాడు.
Albert Einstein
Quote: 10
మతం లేని సైన్స్ కుంటిది, సైన్స్ లేని మతం గుడ్డిది.
Albert Einstein
Quote: 11
విజయవంతమైన వ్యక్తిగా తయారవడానికి ప్రయత్నించకండి. మంచి విలువలు కలిగిన మనిషిగా తయారవడానికి ప్రయత్నించండి.
Albert Einstein
Quote: 12
మనం సృష్టించిన ప్రపంచం మన ఆలోచనా ప్రక్రియ. మన ఆలోచన మార్చుకోకుండా ప్రపంచాన్ని మార్చలేము.
Albert Einstein
Quote: 13
మీ ప్రయత్నాన్ని ఆపేవరకు మీరు విఫలం కాలేరు.
Albert Einstein
Quote: 14
గొప్ప మనుష్యులు ఎల్లప్పుడూ సాధారణ మనస్సు గల మనుష్యుల నుండి హింసాత్మక వ్యతిరేకతను ఎదుర్కొంటారు .
Albert Einstein
Quote: 15
ఈ ప్రపంచం నివసించడానికి చాలా ప్రమాదకరమైనది; అది చెడ్డ వ్యక్తుల వల్ల కాదు, చెడ్డ వ్యక్తులని ఏమీ చేయని వ్యక్తుల వల్ల మాత్రమే.
Albert Einstein
Quote: 16
కష్టం మధ్యలోనే అవకాశం ఉంటుంది.
Albert Einstein
Quote: 17
అధికారంపై గుడ్డి నమ్మకం సత్యానికి గొప్ప శత్రువు.
Albert Einstein
Quote: 18
మన పరిమితులను తెలిసుకోగలితే, వాటిని దాటగలం.
Albert Einstein
Quote: 19
మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, దానిని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకోండి.
Albert Einstein
Quote: 20
ఇతరుల కోసం జీవించిన జీవితం మాత్రమే విలువైనది.
Albert Einstein
Quote: 21
చాలా విచారకరమైన కాలంలో ఉన్నాము; పక్షపాతం కంటే అణువును పగలగొట్టడం ఇప్పుడు సులభం అయింది.
Albert Einstein
Quote: 22
నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని ఒప్పుకుంటాడు.
Albert Einstein
Quote: 23
మూడు గొప్ప శక్తులు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి: మూర్ఖత్వం, భయం మరియు అత్యాశ.
Albert Einstein
Quote: 24
రోజుకు కనీసం ఒక్కసారైనా, మీ గురించి ఆలోచించే మరియు కలలు కనే స్వేచ్ఛను అనుమతించండి.
Albert Einstein
Quote: 25
అందరూ మేధావులే. కానీ మీరు ఒక చేపను చెట్టుపైకి ఎక్కే సామర్థ్యంతో పోలిస్తే, ఆ చేప తెలివితక్కువదని నమ్మి దాని జీవితమంతా అలాగే గడిపేస్తుంది.
Albert Einstein
Quote: 26
మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏదైనా చేయవద్దు.
Albert Einstein
Quote: 27
మీరు నేర్చుకోవడం మానేసిన తర్వాత మీరు చనిపోవడం ప్రారంభిస్తారు.
Albert Einstein
Quote: 28
మూర్ఖుల గుండెల్లో మాత్రమే కోపం ఉంటుంది.
Albert Einstein
Quote: 29
నిన్నటి నుండి నేర్చుకోండి, ఈ రోజు కోసం జీవించండి, రేపటి కోసం ఆశించండి.
Albert Einstein
Quote: 30
జ్ఞానం మరియు అహం నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. తక్కువ జ్ఞానం ఉంటే , అహం ఎక్కువగా ఉంటుంది.
Albert Einstein
Here is the end of List ofAlbert Einstein Quotes in Telugu
All Top 30 Albert Einstein Quotes in Telugu are in Telugu Text.
Stay Motivated. Visit this Website for best Quotes in Telugu Text.